మన ప్రాచీన భారతీయ వైదిక స్థపతులు, శిల్పులు సృష్టించిన అత్యద్భుతమైన దేవాలయ నిర్మాణ కళ, శిల్ప కళ ఈ మానవ జాతికి అందిన అమూల్యమైన జ్ఞాన సంపద. ఎన్నో తరాల నుండి... ఇంకా ఎన్నో... తర తరాల వరకు….. సూర్య చంద్రులు ఉన్నంత వరకూ…. మానవ జాతి సముద్ధరణకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. దాని గొప్పదనం మహా సముద్రమంత…కాదు కాదు ఆకాశమంత…
అందులో అణువంత జ్ఞానాన్ని ఆర్జించగలిగినా… ఆర్జించిన దాంట్లో ఒక్క పరమాణువంత కార్యరూపం లోకి తీసుకు రాగలిగినా ఈ జన్మ ధన్యమైనట్లే…
భగవద్, భాగవత, ఆచార్య కృప, ఆ దిశ గా నడిపిస్తుందని భావిస్తూ…
ప్రస్తుతం నిర్మాణం కొనసాగుతున్న నా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం, యాదాద్రి తిరుమల దేవస్థానం., భువన గిరి. తెలంగాణ.,యొక్క మరిన్ని చిత్రాలు
శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం, ద్రావిడ ఆలయ నిర్మాణ రీతులను అనుసరిస్తూ, అసమానమైన ప్రయత్నాలతో,
ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ని రూపొందించడం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు శ్రీ మానేపల్లి రామారావు గారు, శ్రీ మానేపల్లి మురళీ కృష్ణ గారు మరియు శ్రీ మానేపల్లి గోపీ కృష్ణ గార్లకు నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
Thanks to my team Sri Sudhakar Singh Bondili Sri Prasad Kandukuri Sri Sivakrishna Gandeti Sri Agaram Mohan Sri Uppalapati Purushotham Reddy. Sri Chandra Rao Veeravasarapu Sri Kandukuri Venkatesh Sri Kotha Raghavendrasagar Sri Dhana Shekar Reddy Sri Ravi Teja Sri Ashokkumar Manepalli Sri Suresh Namana
No comments:
Post a Comment